పనిమనిషిగా చేరి.. నగలతో పరార్

HYD: బోయినపల్లిలో పనిమనిషిగా చేరి ఇంట్లో బంగారు నగలతో ఉడాయించిన మహిళను బోయిన్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి రూ.8.20లక్షల విలువైన 112 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన కంచర్ల సువర్ణ (48) గతేడాది దండిభట్ల శివరామకృష్ణ అత్తమ్మకు సేవలు అందించేందుకు పనిలో చేరింది. ఇంట్లో నుంచి తన సామానుతో యజమాని నగలు తీసుకొని పరారైంది.