'జనసేవాదళ్ వాలంటీర్ల కృషి అభినందనీయం'

W.G: ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు సేవలు అందించడంలో, మతతత్వ, వేర్పాటువాద శక్తులకు వ్యతిరేకంగా సీపీఐ జనసేవాదళ్ వాలంటీర్లు చేస్తున్న కృషి అభినందనీయమని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. ఈనెల 19, 20 తేదీలలో తణుకులో జరగనున్న సీపీఐ జిల్లా మహాసభల్లో రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతులో పాల్గొనే వాలంటీర్ల శిక్షణ శిబిరాన్ని ఆయన ఇవాళ ప్రారంభించారు.