పంచాయతీల పురోగతికి ప్రణాళికలు

VZM: పంచాయతీల అభివృద్ధికి ప్రణాళిక అవసరమని గజపతినగరం ఎంపీడీవో కళ్యాణి అన్నారు. మంగళవారం గజపతినగరంలోని పాత ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ పురోగతి వెర్షన్ 2.0 శిక్షణ కార్యక్రమం జరిగింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక పాల్గొన్నారు.