రూ.15 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

రూ.15 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

జగిత్యాల: అర్బన్ మండలం మోతే గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.15 లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామానికి చెందిన సిర్ర నర్మదా మోహన్ ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.