'పాఠశాలల ముస్తాబు' కార్యక్రమాన్ని నిర్వహించాలి
PPM: విద్యార్థుల ముస్తాబు కార్యక్రమం మాదిరిగా ఇకపై పాఠశాలల ముస్తాబు కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్ది మంగళవారం HMలను ఆదేశించారు. ప్రతి పాఠశాలలో దీన్ని కచ్చితంగా ఆచరించాలని, పాఠశాల ప్రాంగణంలో చెత్త లేకుండా పరిశుభ్రత వాతావరణం కనిపించాలన్నారు. ప్రాంగణంలో పచ్చని మొక్కలు, పూల మొక్కలతో అందంగా ఉంచాలని సూచించారు.