వైభవంగా దుర్గామాతకు బోనాలు

వైభవంగా దుర్గామాతకు బోనాలు

JGL: కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో సోమవారం నవరాత్రులను పురస్కరించుకుని దుర్గామాత సన్నిధిలో బోనాల పండగ నిర్వహించారు. మహిళలు పసుపు, కుంకుమ, బెల్లం నైవేద్యాలతో నింపిన బోనాలను తలపై పెట్టుకుని ఊరంతా తిరుగుతూ డప్పు చప్పుల్లతో అమ్మవారి వద్దకు చేరుకున్నారు. పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో గ్రామస్తులంతా సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ప్రజలు వేడుకున్నారు.