డిప్యూటీ స్పీకర్ పై దాడిని ఖండించిన పవన్ కళ్యాణ్

డిప్యూటీ స్పీకర్ పై దాడిని ఖండించిన పవన్ కళ్యాణ్

W.G: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆకివీడు రామాలయంలో పూజకు వెళ్లిన డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజుపై జరిగిన దాడిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఖండించారు. పవిత్రమైన పండుగ రోజున ఇలాంటి ఘటన జరగడం వెనుక ఏదైనా కుట్ర కోణం దాగి ఉందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘర్షణలో గాయపడిన జనసేన పార్టీ నాయకులు వీలైనంత త్వరగా కోలుకోవాలని పవన్ ఆకాంక్షించారు.