నీటి కుంటలో జారి పడి మహిళ మృతి
NRML: సోన్ మండలం, వెల్మల్ గ్రామానికి చెందిన మూడ సాయవ్వ (47) గురువారం బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు నీటికుంటలో జారిపడి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.