ఉగ్రవాదుల దాడిపై జర్నలిస్టుల నిరసన ర్యాలీ

ఉగ్రవాదుల దాడిపై జర్నలిస్టుల నిరసన ర్యాలీ

ప్రకాశం: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడికి పాల్పడిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ అన్నారు. మార్కాపురంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో విలేకరులు ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రెస్ క్లబ్ నుంచి ప్రధాన రహదారి వరకు నిరసన తెలియచేశారు.