ఏకగ్రీవంగా ఎన్జీవోస్ అసోసియేషన్ ఎన్నికలు

ఏకగ్రీవంగా ఎన్జీవోస్ అసోసియేషన్ ఎన్నికలు

కృష్ణా: గుడివాడ ఎన్జీవోస్ అసోసియేషన్ తాలూకా యూనిట్ ఎన్నికలు గురువారం ఏకగ్రీవంగా జరిగాయి. ఈ ఎన్నికలకు అసోసియేషన్ జిల్లా నాయకులు షేక్ ఫరీద్ భాష ఎన్నికల అధికారిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉల్లి కృష్ణ పర్యవేక్షకులుగా వ్యవహరించారు. గుడివాడ ఎన్జీవో హోంలో నిర్ణీత సమయానికి అన్ని పదవులకు కే.పీ.రావు, రాజేంద్రప్రసాద్ ప్యానల్ మాత్రమే నామినేషన్‌లు దాఖలు చేశారు.