జగన్నాథ రథయాత్రకు ప్రత్యేక బస్సులు

VZM: జగన్నాథ రథయాత్రకు వెళ్లే భక్తుల కోసం జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు డిపో అధికారులు తెలిపారు. ఈ నెల 26న సాయంత్రం నాలుగు గంటలకు జిల్లా కేంద్రం నుంచి బయల్దేరతాయి. మూడు రోజులపాటు సాగే ఈ యాత్రలో మూడు పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా ప్రణాళిక రూపొందించారు. ఈ యాత్రకు టికెట్ ధర రూ.2,500గా నిర్ణయించారు. www.apsrtconline.in వెబ్‌సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు.