అద్భుతం.. వాగులో బయటపడ్డ చారిత్రక శిల్పం
TG: భూపాలపల్లి జిల్లా మాదారం సమీపంలోని పెద్దవాగులో ఐదడుగుల పురాతన విష్ణు విగ్రహం లభ్యమైంది. నల్ల గ్రానైట్ శిలతో చెక్కిన ఈ అద్భుత శిల్పం కాకతీయుల కాలం నాటిదని భావిస్తున్నారు. కొన్నేళ్లుగా ఇసుకలో కూరుకుపోయిన ఈ విగ్రహం, నీరు తగ్గడంతో బయటపడగా.. స్థానికులు దానిని వెలికితీశారు. ఈ విగ్రహం కోసం గ్రామస్థుల మధ్య పోటీ నెలకొనగా, పురావస్తు శాఖ దీనిపై శాస్త్రీయంగా పరిశోధన చేయాల్సి ఉంది.