పోగొట్టుకున్న ఫోన్ అందజేత

పోగొట్టుకున్న ఫోన్ అందజేత

KNR: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను CEIR టెక్నాలజీ ద్వారా కనుక్కొని బాధితుడికి అందించినట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. మార్చి 20న కమటం సాయికుమార్ అనే వ్యక్తి తన ఫోన్‌ను మొగ్దుంపూర్లో పోగొట్టుకున్నానని ఫిర్యాదు చేశాడు. CEIR టెక్నాలజీ ద్వారా జగిత్యాలలో ఉన్నట్లు కనుక్కొని ఫోన్ యజమాని సాయికుమార్‌కు అందించారు.