'హై స్కూల్ అభివృద్ధికి అందరూ సహకరించాలి'
AKP: కోటవురట్ల జెడ్పీ బాలికల హైస్కూల్ అభివృద్ధికి అందరూ సహకరించాలని HM నిర్మల కుమారి పిలుపునిచ్చారు. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశం శుక్రవారం పండగ వాతావరణంలో నిర్వహించారు. విద్యార్థుల ప్రగతిని తెలుసుకునేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు HM తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన థింసా నృత్యం అలరించింది. TDP నాయకులు జానకి శ్రీను పాల్గొన్నారు.