ఆదోనిలో చైన్ స్నాచర్లు హల్ చల్

ఆదోనిలో చైన్ స్నాచర్లు హల్ చల్

కర్నూలు: గుడికి వెళుతున్న మహిళా మెడలో చైన్‌ను ఎత్తుకెళ్లిన ఘటన ఆదోనిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్.కే.డి కాలనీకి చెందిన ఆదిలక్ష్మి పట్టణంలోని చిన్న మార్కెట్‌లో ఉన్న శ్రీ మహాయోగి లక్ష్మమ్మ దేవాలయానికి దర్శనం కోసం వెళ్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను బైక్‌పై వెంబడించి మెడలో గోల్డ్ చైన్‌ను ఎత్తుకెళ్లారని ఆమె వాపోయింది.