రచయిత అందెశ్రీ మరణం పట్ల ఎమ్మెల్యే దిగ్భ్రాంతి
MHBD: తెలంగాణ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ' రచయిత అందెశ్రీ మరణం పట్ల మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన తెలుగు సాహిత్యానికి, తెలంగాణ ఆత్మను ప్రతిబింబించిన గీత రచనలకు చేసిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు.