కబ్జా నుంచి బయటపడిన దేవాదాయ శాఖ భూమి

KKD: రూరల్ బొగ్గవరపు సుబ్బారావు సత్రానికి చెందిన దేవాదాయ భూమి 2.39 సెంట్లు సామర్లకోట మండలం బోయినపూడి గ్రామంలో ఓ రైతు ఆక్రమించాడు. దీనిపై దేవాదాయ శాఖ హైకోర్టులో కేసు గెలిచింది. శుక్రవారం డీఈవో నాగేశ్వరావు ఆధ్వర్యంలో ఈవో శివ బాబు, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కలసి భూమిని స్వాధీనం చేసుకుని ఆక్రమణలనున తొలగించారు.