వైసీపీ పంచాయతీ రాజ్ సెక్రటరీగా ఫిరోజ్ నియామకం
GNTR: వైసీపీ రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం సెక్రెటరీగా మంగళగిరికి చెందిన ఎండీ ఫిరోజ్‌ను నియమిస్తూ వైసీపీ అధినేత జగన్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. తనకి ఈ బాధ్యత ఇచ్చిన జగన్‌కి ఫిరోజ్ ధన్యవాదాలు తెలిపారు. అలానే తన నియామకానికి సహకరించిన వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దొంతి రెడ్డి వేమారెడ్డికి ఫిరోజ్ కృతజ్ఞతలు తెలిపారు.