'పైరును టీడీపీ నాయకులు ధ్వంసం చేశారు'

ప్రకాశం: పొదిలి మండలం అన్నవరం గ్రామంలో కంది పైరును గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ధ్వంసమైన కంది పైరు వైసీపీ సానుభూతిపరులది కావడంతో టీడీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దాదాపు 20 ఎకరాలలో కంది పంట ధ్వంసం చేసినట్లుగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీసులకు శుక్రవారం రైతులు ఫిర్యాదు చేశారు.