త్వరలో ఫీజు బకాయిలు చెల్లిస్తాం: భట్టి

HYD: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బకాయిలపై ఇంజినీరింగ్, టెక్నికల్ కాలేజీల యజమానులు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తున్నామని, అసెంబ్లీ సమావేశాల తర్వాత దశల వారీగా చెల్లిస్తామన్నారు. ఉన్నత విద్యా సంస్థలు మనుగడ సాగించాలంటే బకాయిలు ఉండకూడదని మంత్రి పేర్కొన్నారు.