VIDEO: 'హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి'
WGL: జిల్లాలో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ సత్య శారదా పాల్గొన్నారు. కలెక్టరేట్ సమీప ప్రధాన రహదారిపై హెల్మెట్ ధరించిన వాహనదారులను ఆపి పూల మొక్కలు అందించి అభినందించారు. ప్రతి ఒక్కరూ ప్రాణ భద్రత కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు.