VIDEO: యూరియా కోసం ఆందోళన చెందుతున్న రైతులు

KNR: అధికారుల తీరుతో గంటల తరబడి క్యూ లైన్లో నిలబడుతు అనేక ఇబ్బందులు పడుతున్నమని జమ్మికుంట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్ కార్డు వివరాలు సరిగ్గా లేవంటూ యూరియా ఇవ్వడంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు అరోపించారు. ఓటీపీల వల్ల అనేక సమస్యలు వస్తున్నయని అలాగే సమయం వృధా అవుతుందని పేర్కొన్నారు. ఈ విషయలపై సంబంధిత అధికారులు స్పందించి యూరియా అందించాలని కోరారు.