'పశువైద్యం పట్ల నిర్లక్ష్యం వహించరాదు'
SKLM: పశు వైద్యం అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించరాదని పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు ఎస్. సూర్యనారాయణ అన్నారు. మంగళవారం ఆమదాలవలస మండలంలోని కొత్తవలస, నెల్లిపర్తి, చీమలవలస కొరపాం, కలివరం గ్రామీణ పశు వైద్య కేంద్రాలను (RLU) తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏడి నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.