ఇలపర్రులో సిమెంట్ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇలపర్రులో సిమెంట్ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే

W.G: కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతోందని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. గురువారం పెనుగొండ మండలం ఇలపర్రు జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద నూతనంగా నిర్మించిన సిమెంట్ రహదారిని ఆయన ప్రారంభించారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ కేతా సత్తిబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు.