వరంగల్ నుంచి మేడారం జాతరకు 290 ప్రత్యేక బస్సులు
వరంగల్ బస్ స్టేషన్ నుంచి మేడారం మహా జాతరకు ఇవాళ నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. లక్షకు పైగా ప్రయాణికులు వరంగల్ నుంచి మేడారం వెళ్తారని అంచనా. ఇందుకోసం 290 బస్సులు సిద్ధంగా ఉంచారు. అవసరమైతే మరిన్ని బస్సులు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.