VIDEO: నెల రోజులుగా అంధకారంలో శ్రీనగర్ కాలనీ
ASF: కాగజ్ నగర్ పట్టణంలోని శ్రీనగర్ కాలనీ నెల రోజులుగా అంధకారంలో మగ్గుతోంది. వీధి దీపాలు వెలగక రాత్రి వేళల్లో మహిళలు, వృద్ధులు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. పూర్తిగా చీకటి ఉండటంతో దొంగతనాలు, ప్రమాదాలు జరుగుతాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి, పాడైన వీధి దీపాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.