డీఐజీని కలిసిన టీడీపీ జిల్లా అధ్యక్షురాలు
కర్నూలు నగరంలోని క్యాంప్ కార్యాలయంలో డీఐజీ కోయ ప్రవీణ్‌ను టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితులు, ప్రజలకు సంబంధించిన సమస్యలు, పార్టీ కార్యక్రమాల సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పోలీస్ శాఖతో సమన్వయంగా పనిచేస్తామన్నారు.