VIDEO: బాణాసంచా దుకాణాలను పరిశీలించిన కమిషనర్
KDP: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని బద్వేల్ మున్సిపాలిటీలో సిద్దవటం రోడ్డులో,పోరుమామిళ్ల బైపాస్‌లో ఏర్పాటు చేసిన బాణాసంచా దుకాణాలను బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి పరిశీలించారు. బాణాసంచా విక్రయాలు జరిగేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నారా లేదా అన్న విషయాల గురించి ఆయన ఆరా తీశారు.