సమగ్ర అభివృద్ధి కోసం పని చేయాలి: కలెక్టర్
WGL: కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన డీఆర్డీఏ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రతి శాఖ తమ ప్రణాళికలను సమయపాలనతో అమలు చేస్తేనే గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలపడుతుందని సూచించారు.