నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
KNR: విద్యుత్ మరమ్మతుల కారణంగా నగరంలోని పలు ఏరియాల్లో ఇవాళ కరెంట్ ఉండదని రూరల్ ఏడీఈ గాధం రఘు ఒక ప్రకటనలో తెలిపారు. సీతారాంపూర్, జగిత్యాల రోడ్, సాయిబాలజీ నగర్, ఆర్టీసీ కాలనీ ఏరియాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఈ అంతరాయాన్ని వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.