VIDEO: అప్పుల బాధతో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య

VIDEO: అప్పుల బాధతో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య

WGL: వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన యువ రైతు దుంపల సోమయ్య(42) అప్పుల భారం, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక మంగళవారం వ్యవసాయ పొలం వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర మనస్తాపానికి గురైన సోమయ్య పురుగుల మందు సేవించినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.