కలుషిత నీరు వస్తోందని మహిళల ఆందోళన
కృష్ణా: జగ్గయ్యపేట మండలంలోని షేర్ మహమ్మద్‌పేట సైదిరెడ్డి బజార్‌లో కలుషిత నీరు సరఫరా అవుతోందని మహిళలు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. పైపులైన్లలోకి మురుగునీరు చేరి తాగునీరు దుర్గంధం వెదజల్లుతోందని సీపీఎం నేత కోట కృష్ణ ఆరోపించారు. ఈ నీటి వల్ల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి పైపులైన్ల మరమ్మతులు చేపట్టాలని కోరారు.