ఉగ్రవాదుల సహాయకులు అరెస్టు

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల సహాయకులను ఆర్మీ అధికారులు అరెస్టు చేశారు. బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులకు సాయం చేస్తున్న ఇద్దరిని చెక్‌పోస్టు వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి గ్రనేడ్, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. పహల్గామ్ దాడి నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.