రైతు సమస్యలపై ఎమ్మెల్యే ఆరా
CTR: వెదురుకుప్పం మండలంలో జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మంగళవారం పర్యటించారు. పర్యటన ముగిసిన అనంతరం తిరిగి వెళ్తూ మండలంలోని చవట గుంట సంతలో రైతుల వద్ద కూరగాయలు కొనుగోలు చేశారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.