గాంధీ విగ్రహ ధ్వంసం అప్రజాస్వామికం: తాటికొండ సీతయ్య

SRPT: నాగర్ కర్నూలు జిల్లా వనపర్తిలో గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం అప్రజాస్వామికమని జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు సీతయ్య అన్నారు. మంగళవారం తుంగతుర్తిలో మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.