మను సింఘ్వీ నామినేషన్ దాఖలులో మంత్రి కోమటిరెడ్డి
NLG: రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ తన మొదటి సెట్ నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సింఘ్వీ సతీమణి కూడా హాజరయ్యారు. నామినేషన్ అనంతరం మంత్రి కోమటిరెడ్డి సింఘ్వీకి శుభాకాంక్షలు తెలియజేశారు.