శంభునికుంటను కాపాడాలని వినతి

శంభునికుంటను కాపాడాలని వినతి

SRD: శంభునికుంట సుందరీకరణపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు సీపీఎం నేత నరసింహారెడ్డి వినతిపత్రం అందజేశారు. అమీన్‌పూర్ మండలం బీరంగూడలో ఇళ్ల మధ్య ఉన్న ఈ కుంటను ఆక్రమణల నుండి కాపాడి, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఈ కుంట చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.