'అనుమతులు ఉంటేనే క్వారీ నిర్వహణ పనులు చేపట్టాలి'
NTR: క్వారీ నిర్వహణకు అవసరమైన అనుమతులు తెచ్చుకుంటేనే నిర్వహించాలని తిరువూరు ఆర్డీవో కే. మాధురి తెలిపారు. మండలంలోని మేడూరు గ్రామంలో ఉన్న గుట్టను అక్రమంగా తవ్వుతున్నారంటూ, లోకాయుక్తకు వచ్చిన ఆరోపణలో భాగంగా బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ.. అన్ని అనుమతులు తెచ్చుకోవాలని క్వారీ నిర్వహకులకు సూచించారు.