సమాజంలోని సమస్యలకు పరిష్కారాలు చూపేలా ప్రయోగాలు
HYD: ట్రిపుల్ ఐటీ HYDలో 'ఆర్ అండ్ డీ షో కేస్-2026' వార్షిక ప్రదర్శన నిన్న ప్రారంభమైంది. సాంకేతిక పరిశోధనలకు కేంద్రమైన IIIT HYDలో విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెడుతూ, సమాజంలోని సమస్యలకు పరిష్కారాలు చూపేలా రూపొందించిన ప్రయోగాలు అబ్బురపరుస్తున్నాయి. IIIT డైరెక్టర్ ప్రొఫెసర్ సందీప్ కె.శుక్లా మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.