సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

WGL: వరంగల్ నగరంలోని భద్రకాళి ఆలయంలో గల వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చకులు ఇవాళ పాలాభిషేకం చేశారు. నేడు మంగళవారంను పురస్కరించుకొని స్వామికి పాలతో అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భద్రకాళి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆలయానికి తరలివస్తున్న భక్తులు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సైతం దర్శించుకుంటున్నారు.