గుండెపోటుతో మహిళ మృతి

గుండెపోటుతో మహిళ మృతి

NRML: భైంసాకు చెందిన బచ్చువార్ సంగీత (40) అనే మహిళ విహారయాత్రలో గుండెపోటుతో మృతి చెందారు. ఇటీవల భైంసాకు చెందిన 25 మంది బృందం నేపాల్ యాత్రకు వెళ్ళి తిరిగి వస్తుండగా సోమవారం ఉదయం బీహార్లోని పాట్నాలో సంగీతకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో భైంసాలో విషాదఛాయలు అలుముకున్నాయి.