ధారూర్‌లో భారీ వర్షం
VKB: ధారూర్ మండల కేంద్రంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత వారం రోజులుగా పొడిగా ఉన్న వాతావరణం ఈ భారీ వర్షంతో తిరిగి చల్లబడింది. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం భారీ వర్షాలకు రైతులు సామాన్య ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. ఇప్పటికే పంటల పండగ నిరంతరం సతమతమవుతున్న ప్రజలపై ఈ భారీ వర్షం ఎంతో ఇబ్బందికి గురి చేసింది.