జిల్లాకు 'ప్రకాశం' అని నామకరణం చేసిన రోజు ఇదే..!
జిల్లాకు 'ప్రకాశం' అనే పేరును నామకరణం చేసిన ప్రత్యేక రోజు నేడు. 1970లో జిల్లా ఏర్పడగా.. 1972 డిసెంబర్ 5న స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి సీఎం టంగుటూరి ప్రకాశంను గౌరవించడంలో భాగంగా జిల్లాకు ఆయన పేరు పెట్టారు. ఆయన టంగుటూరు మండలం వినోద్ రాయుని పాలెంలో జన్మించి, స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ మహనీయుడి పేరుతో ఏర్పడిన జిల్లా ఇది.