'ఇరువర్గాల ఘర్షణలో ఎనిమిది మందిపై కేసు'

KMM: బోనకల్ మండలం ముష్టికుంట్లలో ఇండ్ల వద్ద దారి విషయమై శుక్రవారం ఇరువర్గాలు ఘర్షణకు దిగగా ఎనిమిది మందిపై కేసు నమోదు అయినట్లు ఎస్సై పి.వెంకన్న తెలిపారు. ఘటనలో ఓ వర్గానికి చెందిన పండగ కృష్ణ, మరో వర్గానికి చెందిన షేక్ ఇమాంబీకి గాయాలయ్యాయి. ఫిర్యాదు చేయడంతో షేక్ ముస్తఫా,షేక్ ఇమాంబీ,షేక్ రజియా,షేక్ కుతుబుద్దీన్ మరి కొందరిపైన కేసు నమోదు చేశామన్నారు.