కురుమూర్తి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
NGKL: దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి స్వామి ఆలయం అమావాస్య, ఉగాది పర్వదినాల నేపథ్యంలో బుధవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, దాసంగాలు, మొక్కులు సమర్పించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా సందడిగా మారింది. రేపు అధిక సంఖ్యలో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.