నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

WGL: వర్ధన్నపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇవాళ ఎమ్మెల్యే KR నాగరాజు విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మొదట ఉదయం 10:30 గంటలకు మడికొండ-ధర్మసాగర్ రోడ్డులోని మహా గార్డెన్స్‌లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు వచ్చి విజయవంతం చేయాలని MLA క్యాంప్ కార్యవర్గం కోరింది.