ఫిరంగిపురంలో విద్యార్థులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు
GNTR: ఫిరంగిపురం మండలంలో 0-6, 6-15 ఏళ్ల విద్యార్థుల కోసం ప్రత్యేక ఆధార్ క్యాంపులు మంగళవారం నుంచి నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శివ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గుండాలపాడు ఎంపీపీ స్కూల్ (16-18), పొనుగుపాడు జిల్లా పరిషత్ హై స్కూల్(19-20), తక్కెళ్ళపాడు ఎంపీపీ స్కూల్(22-24), తేదీలలో క్యాంపులు జరుగుతాయన్నారు.