'యువత కళాకారులు కవులను ఆదర్శంగా తీసుకోవాలి'
KNR: శంకరపట్నం మండల కేంద్రంలో ప్రజా సంఘాలు బిసి నాయకుడు బొంగోని అభిలాష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజా కవి అందెశ్రీ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, క్రాంతి రాష్ట్ర అధ్యక్షులు గాయకులు పృథ్విరాజ్ మండలంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు అందెశ్రీ గద్దర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు