మే డే వేడుకల వాల్ పోస్టర్ ఆవిష్కరణ
SRCL: మే డే వేడుకలు విజయవంతం చేయాలని సీపీఐ వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కడారి రాములు కోరారు. 141వ మే డే వేడుకల వాల్ పోస్టర్‌ను గురువారం వేములవాడలో సీపీఐ నాయకులు ఆవిష్కరించారు. మే 1వ తేదీన నిర్వహించే మే డే వేడుకల్లో కార్మికులు, కర్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె.వి.అనసూయ, గాజుల పోశయ్య, పందుల మల్లేష్, పాల్గొన్నారు.