పేలిన గ్యాస్ సిలిండర్.. తప్పిన ప్రమాదం

పేలిన గ్యాస్ సిలిండర్.. తప్పిన ప్రమాదం

కర్నూలు జిల్లా ఆలూరులోని హత్తిబెళగల్ రోడ్డులోని ఓ ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన గురువారం చోటుచేసుకుంది. అయితే గ్యాస్‌పై వంట చేస్తుండగా.. సడన్‌గా రెగ్యులేటర్ నుంచి గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో, భయంతో గృహిణి బయటకు పరుగులు తీసింది. బయటికి వచ్చిన కాసేపటికే సిలిండర్ పెలినట్లు బాధితురాలు తెలిపింది. ఈ ఘటనలో బీరువాలో ఉన్న నగదు, బంగారం అగ్నికి ఆహుతయినట్లు పేర్కొన్నారు.